స్వైన్ ఫ్లూ ప్రాణాంతకం కాదు. సరియైన చికిత్స మరియు జాగ్రత్తలు వహిస్తే నివారణ సాధ్యం.

prathima-hospitals-swine-flu-prevention-tips

స్వైన్ ఫ్లూ గడిచిన కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఆగస్టు నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో ఉధృతంగా విజృంభిస్తూ  అనేక మరణాలకు  కారణం అవుతుండటం ప్రజలను భయాందోళనలకు  గురిచేస్తుంది.  ఒక్కొక్కసారి ఎండాకాలంలో కూడా ఈ వ్యాధి లక్షణాలు  బయట పడుతున్నాయి.  ఇది ఎక్కువగా వాతావరణం చల్లగా ఉండేటప్పుడు అంటే వర్షాకాలం మరియు శీతాకాలంలో ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తుంది.

స్వైన్ ఫ్లూ కూడా ఒక రకమైన ఫ్లూజ్వరం లాంటిదే.  దీని గురించి ఎక్కువగా భయాందోళన  చెందనవసరం లేదు.  రోజు దినచర్యలో కొన్ని నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే  స్వైన్ ఫ్లూ బారిన పడకుండా  మనల్ని మనం కాపాడుకోవచ్చు.

H1N1 అనేవైరస్ మూలంగా స్వైన్ ఫ్లూ వస్తుంది. గాలి ద్వారా ఈ వైరస్ ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాది సోకిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఈ వైరస్ బయటకు వచ్చి గాలిలో ఉండవచ్చు. ఈ వైరస్ ఉన్న గాలిని పీల్చిన వారికి స్వైన్ ఫ్లూ సోకుతుంది.అంతేకాకుండా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడిన తుంపర్లు పడిన ప్రదేశములో వైరస్ అంటుకొని వుంటుంది. ఆ వైరస్ అంటుకొని ఉన్న ప్రదేశమును చేతితో ముట్టుకొని అదే చేతిని ముక్కు,నోరు మరియు కాళ్ళ రుద్దుకున్నపుడు వైరస్ శరీరంలోకి ప్రవెశించే అవకాశము వుంటుంది.

treatment

దీనిని నివారించడానికి స్వైన్ ఫ్లూ సోకిన వ్యక్తులు  నోటికి రుమాలు కానీ లేదా ఏదైనా మాస్కు కానీ ధరించటం  మంచిది. దీని వలన స్వైన్ ఫ్లూ ఇతరులకు వ్యాపించకుండా నిరోదించవచ్చు. స్వైన్ ఫ్లూ అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రజలు బయటకు వెళ్ళే సమయాలలో నోటికి మరియు ముక్కుకి మాస్క్ ధరించడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చు.

లక్షణాలు 

సాధారణంగాఫ్లూజ్వరంలక్షణాలేస్వైన్ఫ్లూలోకూడావుంటాయి.

    • జ్వరం, తలనొప్పి
    • ముక్కు దిబ్బడ, ముక్కు కారడం
    • గొంతునొప్పి, దగ్గు
    • ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన నీరసం
    • ఆకలి మందగించటం
    • కొందరికి వాంతులు విరోచనాలు

Swine Flu can be curable and tratable with proper treatment

ఫ్లూ లక్షణాలు కనబడితే పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. బయట తిరగకుండా ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అదే ఫ్లూ లక్షణాలు ముదురుతుంటే నిర్లక్ష్యం చెయ్యకూడదు. లక్షణాలు బాగా తీవ్రమైతే సరియైన చికిత్స తీసుకొవాలి. లేదంటే న్యూమోనియాకి దారితీసి అది తీవ్రమై మరణించే అవకా శం వుంది. స్వైన్ ఫ్లూ మరణాలలో అదికశాతం ఇదే కారణమౌతుంది.

 స్వైన్ఫ్లూనిర్ధారణపరీక్షలు

 స్వైన్ ఫ్లూ కారక వైరస్ H1N1 రక్తంలో ఉండదు. ఇది శ్వాసకోశ సంబంధిత అవయవాలలో ఉంటుంది. డాక్టర్లు నోటి నుంచి మరియు ముక్కు నుంచి స్రావాలను సేకరించి వాటిని పరీక్షలు చేయిస్తారు. దీనిద్వారా స్వైన్ ఫ్లూ వైరస్ యొక్క లక్షణాలను కచ్చితంగా నిర్ధారించవచ్చు.  స్వైన్ ఫ్లూ నిర్ధారిత పరీక్షలు కొన్ని పరీక్ష కేంద్రాల్లో మాత్రమే చేస్తారు. స్వైన్ ఫ్లూ మీద పూర్తి అవగాహన ఉండడం అందరికీ చాలా ముఖ్యమైన విషయం.

ఈ జ్వరాలు చలికాలంలోనే ఎక్కువగా వస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు ఫ్లూ జ్వరాలు ఏ కాలంలోనైనా రావచ్చు, కాకపోతే చలికాలంలో ఫ్లూ కారక వైరస్ గాలిలో ఎక్కువకాలం బతికి ఉంటుంది అందువలన ఎక్కువగా వ్యాపిస్తుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉండే వారిలో ఫ్లూ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవటం, రోజూ వ్యాయామం చేయటం, తగినంత నిద్ర పోవటం, వేళకు భోజనం చేయటం, పండ్లు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. మనము తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తోడ్పడతాయి. దీంతో ఒంట్లోకి ప్రవేశించినా శరీరం దాన్ని సమర్ధంగా ఎదుర్కొంటుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Blogs

Is Thyroid a Serious Problem ?

Thyroid Diseases

The thyroid gland is an important endocrine gland located in the neck, responsible for producing and releasing hormones that regulate metabolism, heart rate, and body temperature.

4

Know more about Heart Holes!

Causes for Heart Holes

Heart holes occur when there is a problem with the development of the heart during pregnancy. The heart develops in the first few weeks of pregnancy, and during this time, any abnormality in the heart's structure can lead to a heart hole.

77

What are the causes for Asthma and How to Prevent it?

Precautions for Asthma

The exact cause of asthma is unknown, but several factors are known to contribute to its development. Genetics, environmental factors, and lifestyle factors are all believed to play a role. Asthma tends to run in families, and people with a family history of the condition are more likely to develop it themselves.

107

What are the causes for Urinary Tract Infections ?

Urinary Tract Infections

Any part of the urinary system can be affected by a urinary tract infection (UTI), including the kidneys, bladder, ureters, and urethra. Gynaecologist in Hyderabad says most UTIs occur in the lower urinary tract, which includes the bladder and urethra. Women are more likely to develop Urinary Tract Infections than men, and they often occur in sexually active women.

91