ఇన్ఫ్లుఎంజా వైరస్ యొక్క లక్షణాలు, కారణాలు, దాని కొరకై చేయాల్సిన నివారణ చర్యలు.

ఇన్ఫ్లుఎంజా వైరస్

ఇన్ఫ్లుఎంజా వైరస్ యొక్క లక్షణాలు, కారణాలు, దాని కొరకై చేయాల్సిన నివారణ చర్యలు.

ఈ ఇన్ఫ్లుఎంజా వైరస్  ఒక ” ఫ్లూ ” వలన కలిగేటువంటి ఒక వైరల్ శ్వాసకోశ వ్యాధి. దీని లక్షణాలు ముఖ్యంగా జ్వరం, తలనొప్పి,
వాంతులు, శరీర నొప్పులు మొదలైనవిగా ఉంటాయి.

ఈ ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ), కాలానుగుణంగా వచ్చే ఫ్లూ అని కూడా అంటారు, ఇది ఇన్ఫ్లుఎంజా వైరస్ల జాతికి చెందిన శ్వాసకోశ వ్యవస్థకు 
సంబంధించిన వైరల్ వ్యాధి. ఫ్లూ అనేది అత్యంత వేగంగా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఏ విధంగా సంక్రమిస్తుందంటే? ఈ వైరస్ సోకిన వ్యక్తి 
మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వారి నుండి శ్వాసకోశ బిందువులను ఇతరులు పీల్చినచొ వారికి ఈ వ్యాధి సోకె అవకాశం ఉంది

ఈ ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) సీజనల్గా  ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతూ ఉంటుంది, ఈ వైరస్ యొక్క తీవ్రత క్రమక్రమంగా 
మారుతూనే ఉంటుంది. ఈ ఫ్లూ ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు సంక్రమిస్తూ 
ఉంటుంది.

ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) లక్షణాలు

  • భరించలేనితలనొప్పి
  • వాంతులుఅవుతూఉండడం, అతిసారం కావడం మరియు దగ్గు వంటి లక్షణాలు 
  • కండరాలలోలేదాశరీరం మొత్తం నొప్పులుగా ఉండడం 
  • చలిజ్వరంగాఉండడం
  • అలసటగాఅనిపించడం
  • ముక్కుకారుతూఉండడం 
  • గొంతులోమంటగాఉండడం

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం వస్తుంది ?

ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) లక్షణాలు ఉన్న వ్యక్తులు ఈ వ్యాధిని మాములుగా ఇంట్లోనే ఉంది నివారించుకోవచ్చు. మీరు ఈ  ఫ్లూ లాంటి లక్షణాలను భారంగా తలిస్తే లేదా ఈ వ్యాధిని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే 
మీ దెగ్గరలో ఉన్న వైద్యుడిని కలవడం ఉత్తమం.

కారణాలు

ఇన్ఫ్లుఎంజా వైరస్ ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. జబ్బు పడిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, లేదా మాట్లాడిన శ్వాసకోశ కణాలు వారి  నుండి చుట్టూ పక్కల ప్రాంతాల్లో లేదా వ్యక్తుల్లో ఈ కణాలు సంక్రమించే అవకాశం ఉంది. ఈ విధంగా పరిసరాలల్లో  పడిన  కణాలను  ఇతరులు తాకడం మూలాన, ఆ తరువాత వారు  గనుక  చేతులను కడక్కోకుండా, అదే చేతితో పెదవులు, కళ్ళు లేదా ముక్కును తాకడం ద్వారా ఈ ఫ్లూ బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) ప్రమాద కారకాలు

  • బలహీనమైనరోగనిరోధకశక్తి కలిగిన వారిని 
  • దీర్ఘకాలికవ్యాధులుఉన్నవారికి 
  • గర్భంతోఉన్నమహిళల్లోనూ 
  • సీజనల్ఇన్ఫ్లుఎంజా(ఫ్లూ) ఆరు నెలల నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులను మరియు 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలను లక్ష్యంగా చేసుకుంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఇతరత్ర సమస్యలు 

ఫ్లూ సమస్యలు ఈ క్రింది విధంగా మారగలవు 

  • గుండె సమస్యలు.
  • న్యుమోనియా.
  • బ్రోన్కైటిస్.
  • ఆస్తమా
  • చెవుల్లోఇన్ఫెక్షన్లు 
  • శ్వాసకోశవ్యాధులు

నివారణ :

ఈ ఫ్లూ యొక్క నివారణకై వార్షిక ఫ్లూ టీకాను పొందండి, ఈ టీకా తీసుకున్న వారిలో ఈ వ్యాధిని నిరోధించే శక్తి మరియు సంక్రమించకుండా ఉండేందుకు తోడ్పడుతుంది  

దానివలన ఆసుపత్రిలో చేరే అవకాశాలు తగ్గుతాయి.

ఈ వ్యాధిని నివారించేందుకు నాసల్ స్ప్రే మరియు సాంప్రదాయిక ఇతరేతర అనేక టీకా అందుబాటులో ఉన్నాయి.

మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సలహా  తీసుకొని, వారు సూచించిన ప్రకారం టీకాలు వేయించుకోవడం శ్రేయస్కరము.

ఇతర నివారణ పద్ధతులు:

  • మీచేతులను సమయానుకూలంగా సబ్బుతో కడగడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ఉత్తమం.
  • మీఇంటి పరిసరాలను మరియు ఉపరితలాలను అదేవిధంగా ఫర్నిచర్ మరియు బొమ్మలు వంటి వస్తువులను ఎప్పటికప్పుడు 
  • సానిటైజ్ లేదా  శుభ్రం చేయడం మంచిది.
  • దగ్గినామరియు తుమ్మినా మీ నోటిని కప్పుకోవడం వలన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని అరికట్టవచ్చు.
  • చేతులతోనోరు, ముక్కు లేదా కళ్లను తాకకుండా ఉండవలెను.
  • ఎనిమిదిగంటల నిద్రా  సమయం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
  • క్రమంతప్పకుండ వ్యాయామం చేయడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు నూతన ఉత్సాహం ఉప్పొంగుతుంది.

డయాగ్నోసిస్

వైద్య నిపుణులు ముందుగా మీ యొక్క వైద్య చరిత్రను అంచనా వేస్తారు, దాని ప్రకారంగా ఫ్లూని నిర్ధారించడానికి మీ యొక్క లక్షణాల 

గురించి మరింతగా తెలుసుకుంటారు, ఈ విషయాన్ని అంచనా వేయడానికి అందుబాటులో వివిధ ఫ్లూ పరీక్షలు ఉన్నాయి.

ఆ పరీక్షల్లో ఒకటి పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్ష, ఇది ఇతర పరీక్షలతో పోలిస్తే మరింత సులభంగా ఉంటుంది 

మరియు ఇన్ఫ్లుఎంజా ఫ్లూ జాతిని గుర్తిస్తుంది.

చికిత్స:

చాలా మంది ఈ యొక్క ఇన్ఫ్లుఎంజా ఫ్లూ వ్యాధిని స్వయంగా గుర్తించవచ్చు. ఈ వైరస్ యొక్క ముఖ్య లక్షణం జలుబు, తలనొప్పి,
ముక్కు కారడం మరియు ఒళ్ళు నొప్పి, ఈ వ్యాధులను నివారించడానికి అనేకమైన నొప్పి నివారణ మందులు మనకు సులభంగా లభ్యం అవుతాయి.
ఈ వ్యాధిని నిర్ములించడానికి మందులతో పాటు, సరైన విశ్రాంతి,  పుష్కలంగా నీరు తీసుకోవడం, మరియు 

మంచి వాతావరణం ఎంతో అవసరం. ఒక వేళా మీరు ఈ వ్యాధి యొక్క లక్షణాలను గుర్తించినా, ఒకటి రెండు రోజుల్లో స్వంతంగా నయం చేసుకోకపోతే వెంటనే మీ దేగ్గర్లో ఉన్న డాక్టర్ ను సంప్రదించి యాంటీవైరల్ మందులను 
మీ డాక్టర్ సలహా సూచనాల మేరకు వాడాలి.

చేయదగినవి మరియు చేయకూడనివి

ఇన్ఫ్లుఎంజా వ్యాధి మరియు దాని తీవ్రతను నివారించడానికి ఈ క్రింది విధంగా అనుసరించడం ముఖ్యం.

చేయదగినవి

  • ఫ్లూ వ్యాక్సినేషన్తీసుకోండి
  • ఫ్లూనినివారించడానికి తరచూ మీ చేతులను కడగండి.
  • ఆరోగ్యకరమైనఆహారం తీసుకోవడం ఉత్తమం.
  • మీడాక్టర్ సూచించిన విధంగా మందులు తీసుకోండి.
  • తగినంతవిశ్రాంతి తీసుకోవాడం మంచిది.
  • తగినమోతాదులో ఎప్పుడు నీరు తాగండి.

చేయకూడనివి

  • మీచేతులను కడుక్కోకుండా లేదా శుభ్రపరచకుండా మీ ముఖాన్ని తాకకండి.
  • దగ్గేటప్పుడులేదా తుమ్మేటప్పుడు మీ నోటిని కప్పుకోవడం ఉత్తమం.
  • ధూమపానంమరియు మద్యపానానికి దూరంగా ఉండండి.
  • వైద్యుడిసలహా లేకుండా ఎప్పుడు మందులను తీసుకోకూడదు.

చివరిగా ఈ వైరస్లు కాలానుగుణంగా వస్తూనే ఉంటాయి. ఈ వ్యాధులు ప్రమాదకరం కానే కావు, ఎక్కువగా ఆలోచించి వీటిని 

గురించి భయపడవద్దు. పైన సూచించిన విధంగా మీరు గనక జాగ్రత్తలు పాటిస్తే ఇన్ఫ్లుఎంజా ఫ్లూ ను మనం అరికట్టవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Blogs

Is Thyroid a Serious Problem ?

Thyroid Diseases

The thyroid gland is an important endocrine gland located in the neck, responsible for producing and releasing hormones that regulate metabolism, heart rate, and body temperature.

4

Know more about Heart Holes!

Causes for Heart Holes

Heart holes occur when there is a problem with the development of the heart during pregnancy. The heart develops in the first few weeks of pregnancy, and during this time, any abnormality in the heart's structure can lead to a heart hole.

77

What are the causes for Asthma and How to Prevent it?

Precautions for Asthma

The exact cause of asthma is unknown, but several factors are known to contribute to its development. Genetics, environmental factors, and lifestyle factors are all believed to play a role. Asthma tends to run in families, and people with a family history of the condition are more likely to develop it themselves.

107

What are the causes for Urinary Tract Infections ?

Urinary Tract Infections

Any part of the urinary system can be affected by a urinary tract infection (UTI), including the kidneys, bladder, ureters, and urethra. Gynaecologist in Hyderabad says most UTIs occur in the lower urinary tract, which includes the bladder and urethra. Women are more likely to develop Urinary Tract Infections than men, and they often occur in sexually active women.

91