కరోనా వైరస్ జాగ్రత్తలు
కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది . ముఖ్యంగా కరోనా వ్యాధిలక్షణాలతో చాలా మంది ని గుర్తించడం మరియు వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు . ఈ వ్యాధి తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుగు రాష్టాలపైనా కూడా పెరుగుతుంది. ఈ వైరస్ భారిన పడకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు వ్యాధిలక్షణాల గురించి తెలుసుకొని జాగ్రత్త పడదాం.
కరోనావైరస్వ్యాధిలక్షణాలుసాధారణంగావ్యాధితీవ్రతనుబట్టిపెరుగుతూఉంటాయి . వ్యాధిలక్షణాలు :
1.జలుబు
2.జ్వరం
3.దగ్గు
4.తలనొప్పి
5.అలసటగా ఉండటం
పైనపేర్కొన్నలక్షణాలతోఎవరైనాఇబ్బందిపడుతుంటేముందుగాతీసుకోవలసినజాగ్రత్తలు:
- దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు ముఖానికి చేతి రుమాలు లేదా నాప్కిన్ అడ్డుపెట్టుకోవాలి
- వీలైనంతవరకు బైటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి
- కుటుంభం సంభ్యులతో ఎక్కువగా కలిసి ఉండకుండా వీలైనంత దూరం పాటించాలి
వ్యాధి లక్షణాల తీవ్రత పెరుగుతుంటే వెంటనే దగ్గరలో ఉన్న ఐసోలేషన్ కేంద్రానికి వెళ్ళాలి.
కరోనావైరస్వ్యాపించకుండాతీసుకోవలసినజాగ్రత్తలు :
- ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఏ వ్యాధి సంక్రమిస్తుంది, కనుక వీలైనంత దూరం పాటించడం శ్రేయస్కరం.
- కరోనా వైరస్ సంక్రమించిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఆ తుంపర్ల ద్వారా వైరస్ సంక్రమిస్తుంది. – కనుక తుమ్మినప్పుడు , దగ్గినప్పుడు చేతిరుమాలు లేదా నాప్కిన్ అడ్డుపెట్టుకోవడం ద్వారా ఏ వ్యాధి సంక్రమణను అరికట్టవచ్చు.
- వైరస్ ఉన్న వ్యక్తి నోటినుండి వచ్చిన తుంపరలు ఏదైనా వస్తువుపై పడిన , ఆ వస్తువుని ఆరోగ్యమైన వ్యక్తి తాకడం ద్వారకుడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. – కనుక వీలైనంత వరకు ఏదైనా వస్తువుని తాకిన చేతులతో ముఖాన్ని, నోటిని మరియు ముక్కుని తాకడం వంటివి చేయకూడదు.
కరోనావైరస్భారినపడకుండాఆరోగ్యంగాఉన్నవ్యక్తులుతీసుకోవలసినజాగ్రత్తలు:
- చేతులను వీలైనన్ని సార్లు సబ్బుతో లేదా శానిటైజర్ లిక్విడ్ తో కడుక్కోవాలి
- మొహాన్ని, నోటిని మరియు ముక్కుని చేతులతో తాకడం వీలైనంతగా తగ్గించాలి.
- జ్వరం, దగ్గు మరియు జలుబుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండడం మంచిది
- షేక్ హ్యాండ్ ఇవ్వడం మరియు స్పర్శతో కూడిన ఎటువంటి పలకరింపులైన తగ్గించడం మంచిది.
- జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సంచరించకుండా జాగ్రత్తలు వహించడం మంచిది.
కరోనావైరస్వ్యాధిలక్షణాలనుగుర్తించడానికివైద్యులుచేస్తున్నసూచనలు:
- శారీరక పరీక్షలు
- రక్త పరీక్షలు
- కఫం మరియు శ్వాస సంభందిత సమస్యల నిర్ధారణ పరీక్షలు
కరోనావైరస్వ్యాధిచికిత్సలు:
కరోనా వైరస్ కి కచ్చితమైన చికిత్స విధానాలు అందుబాటులో లేనప్పటికీ, క్రింద పేర్కొన్న మార్గాల ద్వారా వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు,
- రోగికి జ్వరం మరియు దగ్గు, జలుబు సంభందిత మెడిసిన్ ఇవ్వడం
- వీలైనంత ఎక్కువ సమయం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం
- వీలైనంత ఎక్కువగా నీటిని సేవించడం