What is Spina Bifida | వెన్ను చీలిక – Symtoms, Causes and Treatment
వెన్ను చీలిక (Spina Bifida) సాధారణంగా పుట్టుకతో సంభవించే వైకల్యం. శిశువు తల్లి గర్భంలో ఉన్నపుడు ఈ వైకల్యం వెన్నుపాములో ఏర్పడుతుంది.ఇది రెండు విధాలుగా ఉంటుంది.
1. వీపు కింది భాగంలో జుట్టు అధికంగా ఉండటం లేదా,
2. నీటి బుడగ లాగ వాపు కనబడటం.
లక్షణాలు
కొన్నిసార్లు నరాలు తెలియాడుతున్నట్టుగా గాని లేదా నరాలు చర్మం పైన కనబడడం గాని జరుగవచ్చు. వెన్నుపాముకి సంభందించిన నీరు కారుతు ఉండవచ్చు.
కాళ్ళల్లో స్పర్శ తగ్గిపొవడం గాని, బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. మరియు మల, మూత్రాలపైన అదుపు లేకుండా ఉంటుంది.
సాధారణంగా గర్భిణి స్త్రీలలో ఊబకాయం, చిన్న వయసులో గర్బధారణం, పలుమార్లు గర్భశ్రావం జరగడం వలన గాని, ఫోలిక్ యాసిడ్ లోపం వలన గాని శిశువులో వెన్ను చీలిక వైకల్యం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నిర్ధారణ
సాధారణంగా స్కానింగ్ లో గాని, రక్తపరీక్షల ద్వారా గాని లేదా ఉమ్మనీరు పరీక్షల ద్వారా గుర్తించవచ్చు.
వైద్యసదుపాయలు
ఆపరేషన్ ఒక్కటే పరిష్కార మార్గం.
ఆపరేషన్ తరువాత డాక్టర్ పర్యవేక్షణలో వెన్నుపూస ఎదుగుదలని గమనించవలసి ఉంటుంది. ఆత్యాధునిక వైద్యసదుపాయలు అందుబాటులో ఉండటం వలన శిశువు గర్భంలో ఉన్నపుడే ఆపరేషన్ ద్వారా ఈ సమస్యను జననం లోగా పరిష్కరించే అవకాశం ఉంది.
ముందుజాగ్రత్తలు
సరైన ఆహార నియమాలు పటిస్తూ, ఫోలిక్ యాసిడ్ మొతాదు శరీరంలో తగినంతగా ఉండే విధంగా చూసుకోడం ద్వారా ఈ వెన్ను చిలిక అనే వైకల్యము శిశువులో రాకుండా నివారించవచ్చు. Neurologist in Hyderabad